ఉద్యోగుల సమస్యల పరిష్కారాని చొరవ చూపండి: టీఎన్జీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు

by Ajay Maddhiboyina |

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీఓ) అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కోరారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారాని చొరవ చూపండి: టీఎన్జీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీఓ) అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కోరారు.గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ శ్రీ.రామకృష్ణారావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలు ప్రధానంగా సాధారణ బదిలీలు చేయలని, పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతార సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య కార్డులు (EHS) అమలు చేయాలని, వివిధ కారణాలతో సప్లిమెంటరీ జీతం బిల్లులను రెగ్యులర్ జీతం బిల్లులుగా పరిగణిచి వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎలక్షన్ లో బదిలీ అయిన వారిని తిరిగి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకులంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. సీఎస్ ను కలిసిన వారిలో టీఎన్జీఓ ఆఫీసర్స్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు బీ.శ్యామ్, సంఘం నాయకులు పరమేష్ రెడ్డి, లక్ష్మణ్, రామారావు, శ్రీరామ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పద్మావతి తదితరులు ఉన్నారు.

Next Story