Press Censorship: ఆ ఖాతాలను ఆపించింది మోడీ సర్కారే.. కేంద్రంపై ఎలాన్ మస్క్ 'ఎక్స్' సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2025-07-08 12:33:56  IST  )

కేంద్రంపై ఎలాన్ మస్క్ 'ఎక్స్' సంచలన ఆరోపణలు చేసింది.

Press Censorship: ఆ ఖాతాలను ఆపించింది మోడీ సర్కారే..  కేంద్రంపై ఎలాన్ మస్క్ ఎక్స్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ లో ప్రెస్ సెన్సార్ షిప్ పై 'ఎక్స్' (X) మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల భారత్ లో రాయిటర్స్ సహా 2,355 ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేయడం వెనుక భారత ప్రభుత్వ ఆదేశాలు (Central Govt) ఉన్నాయని ఎక్స్ ఇవాళ ఓ సంచలన పోస్టు చేసింది. ఇటీవల భారత్‌లో అంతర్జాతీయ వార్తాసంస్థ ‘రాయిటర్స్‌’ ఎక్స్‌ ఖాతా కొన్ని గంటలపాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎక్స్ కు చెందిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ టీమ్.. జులై 3న భారత ప్రభుత్వం ఇండియాలో 2,355 ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించిందని వీటిలో రాయిటర్స్ (Reuters X Account Blocked), రాయిటర్స్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయి తెలిపింది. వీటన్నింటిని ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద తక్షణమే బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని పేర్కొంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఖాతాలను బ్లాక్ చేసి ఉంచాలని చెప్పిందని తెలిపింది. అయితే ప్రజల నిరసనల తర్వాత ప్రభుత్వం ఈ ఖాతాలను అన్ బ్లాక్ చేయాలని అభ్యర్థించిందని పేర్కొంది.

ఈ బ్లాకింగ్ ఆర్డర్ల కారణంగా భారతదేశంలో కొనసాగుతున్న ప్రెస్ సెన్సార్ షిప్ (Press Censorship in India) గురించి మేము తీవ్ర ఆందోళన చెందుతున్నారమని ఎక్స్ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టపరమైన సవాళ్ల విషయంలో ఎక్స్ భారతీయ చట్టాల ద్వారా పరిమితం చేయబడిందని ఈ పరిమితులను అధిగమించేందుకు తాము అందుబాటులో ఉన్న న్యాయపరమైన అంశాలనుఅన్వేషిస్తున్నట్లు ఎక్స్ తెలిపింది. ప్రభావిత వినియోగదారులు కోర్టుల ద్వారా చట్టపరమైన పరిష్కారాలను అనుసరించాలని కోరుతున్నట్లు పేర్కొంది.. కాగా ఖాతాలను బ్లాక్ చేయడం విషయంలో ప్రభుత్వ ఆదేశాలపై ఎక్స్ తరచు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉంది. గత మార్చిలో ఎక్స్ పై కేంద్ర ప్రభుత్వం దావా వేసిన సంగతి తెలిసిందే.

Next Story