KCR Birthday: పవన్ కళ్యాణ్ సినిమాలో KCR కు ఎలివేషన్.. గూస్ బంప్స్ ఖాయం (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-20 13:33:23  IST  )

నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా విషెస్ చెప్తున్న విషయం తెలిసిందే.

KCR Birthday: పవన్ కళ్యాణ్ సినిమాలో KCR కు ఎలివేషన్.. గూస్ బంప్స్ ఖాయం (వీడియో)
X

దిశ, సినిమా: నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా విషెస్ చెప్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం కేసీఆర్ పేరు మార్మోగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఆయన విషెస్ చెప్తున్నారు. అలాగే పలు సినిమాల్లో ఆయన పేరును ఉపయోగించిన సీన్స్‌ను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, పవర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీలోని ఓ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కె చంద్ర, పవన్ కాంబోలో వచ్చిన ‘భీమ్లా నాయక్’(Bhimla Nayak) చిత్రంలో రానా కూడా కీలక పాత్రలో కనిపించారు.

అయితే ఇందులో రానా అరెస్ట్ అయిన సీన్‌లో ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాను చూస్తుంటాడు. అయితే ఇందులో ఒకతను కీర్తి సురేష్ పేరు చూడమని చెప్పగా.. అందులో కె మీద కేసీఆర్ పేరు కనిపిస్తుంది. ఇక అది చూసిన వారంతా భయపడిపోతారు. కుర్చీలోంచి లేచి ఆశ్చర్యకరంగా చూస్తారు. ఈ సీన్‌లో కేసీఆర్ ఎలివేషన్ అదిరిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలన్నింటికీ గ్యాప్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్ని 50% శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ చేతిలో అన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story