- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏనుగు దంతాల స్మగ్లింగ్.. పోలీసులు, అటవీ శాఖ జాయింట్ ఆపరేషన్
హైదరాబాద్‌లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కలకల రేగింది..

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hydrabad)లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కలకలం రేగింది. ప్రసాద్ అనే వ్యక్తి నగరానికి ఏనుగు దంతాలు తీసుకొచ్చారు. అయితే పోలీసులు, అటవీ శాఖ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ గుట్టును రట్టు చేశారు. ప్రసాద్ నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా వేశారు.
అయితే హైదరాబాద్ నగరానికి ప్రసాద్ ఏనుగు దంతాలు తీసుకురావడం మిస్టరీగా మారింది. ప్రస్తుతం ప్రసాద్‌ను విచారిస్తున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్‌కు ఎవరు తీసుకురమ్మన్నారు.. అసలు ఎవరు ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ గుట్టు వెనుక ఓ ప్రముఖుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మరిన్ని అరెస్ట్‌లు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.






