- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గ్రేటర్‌లో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జీహెచ్‌ఎంసీ పరిధిలో సోమవారం (ఏప్రిల్ 13) అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు టీజీఎస్పీడీసీఎల్ వెల్లడించింది. ఏప్రిల్ 13న మధ్యాహ్నం 16:01 గంటలకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 4381 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే గరిష్ట వినియోగం. కాగా గ్రేటర్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన ఆల్ టైమ్ రికార్డు విద్యుత్ డిమాండ్ 4421 మెగావాట్లు (మార్చి 3, 2026న) అని అధికారులు పేర్కొన్నారు. డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతూ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. భవిష్యత్తులో డిమాండ్, వినియోగం ఇంకా పెరిగినా ఆ అవసరాలను తీర్చడానికి టీజీఎస్పీడీసీఎల్ పూర్తి సన్నద్ధంగా ఉందని స్పష్టం చేసింది. కాగా... ఈ నెల 12న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అంతకు ముందు రెండు రోజుల కంటే తక్కువగా నమోదు కావడం విశేషం.






