- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Electricity Demand: 16వేల మెగావాట్ల మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్
తెలంగాణ విద్యుత్తు డిమాండ్(Telangana Electricity Demand) అనూహ్యంగా పెరిగిపోతుంది(Growing Exponentially). రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ బుధవారం ఉదయం(To Day Mornining) రికార్డు(Record)స్థాయిలో 16వేల మెగావాట్లకు మైలురాయి(16,000 Megawatt Milestone)ని దాటేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యుత్తు డిమాండ్(Telangana Electricity Demand) అనూహ్యంగా పెరిగిపోతుంది(Growing Exponentially). రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ బుధవారం ఉదయం(To Day Mornining) రికార్డు(Record)స్థాయిలో 16వేల మెగావాట్లకు మైలురాయి(16,000 Megawatt Milestone)ని దాటేసింది. ఈ రోజు ఉదయం 07:55 కు 16058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండు నమోదైంది. గత ఏడాది ఇదే నెల 10న నమోదయిన 15998 మెగావాట్ల డిమాండ్ ను అధిగమించడం జరిగింది.
గతేడాది మార్చి 8 న నమోదయిన అత్యధిక విద్యుత్ డిమాండు 15623 మెగావాట్లు కాగా.. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 5 న విద్యుత్ సంస్థలు అధిగమించాయి. అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండు నేపథ్యంలో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీ లతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ ఏడాదిలో భారీ స్థాయిలో నమోదవుతున్న విద్యుత్ డిమాండును ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్ సంస్థలు దీటుగా ఎదుర్కొంటుండటాన్ని అభినందించారు.
డిమాండు ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఎండల తీవ్రత ముందుగానే పెరిగిపోవడం..భూగర్భ జలాల వినియోగం పెరుగుతుండటం...జలవనరుల్లో నీటి నిల్వలు వేగంగా తరిగిపోతున్న నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోతుంది. గత ఏడాది విద్యుత్తు వినియోగ రికార్డులన్ని ఫిబ్రవరి మాసంలో అధిగమించిన తీరు చూస్తే మునుముందు విద్యుత్తు వినియోగ డిమాండ్ మరిన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందని విద్యుత్తు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.






