Power Consumption: GHMC పరిధిలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం.. ఎన్ని మెగావాట్లో తెలుసా?

by Kema Shiva Kumar |   (  Updated:2024-04-18 16:12:48  IST  )

రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యత్ వినయోగం జరిగింది.

Power Consumption: GHMC పరిధిలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం.. ఎన్ని మెగావాట్లో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యత్ వినయోగం జరిగింది. ఈ మేరకు గురువారం మధ్యహ్నం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లతో పోలిస్తే 582 మెగావాట్లు అధికం. రాబోయే మే నెలలో కూడా విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

Next Story