- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి విద్యుత్ చార్జీల పెంపుదలపై విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. తమ వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) వివరాలు, టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీజీఈఆర్సీ)కి అందచేశాయి. ఇందులో 2026-27 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంచవద్దని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ నిర్ణయించాయి.
ఈ మేరకు ఎలక్షన్ కోడ్ ముగియగానే డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ నోటిఫికేషన్ ఇచ్చి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బహిరంగ విచారణ తర్వాత ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది. అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలవుతాయి. అయితే రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు ఉచితి విద్యుత్ పథకం వల్ల డిస్కంలపై భారీగా భారం పడుతోందని... అందుకే త్వరలోనే ఛార్జీలను పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే ఛార్జీల వడ్డింపు ప్రచారానికి రెండు డిస్కంలు స్వస్తి పలికాయి. దీంతో ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండబోదని స్పష్టమైంది.






