- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కలిసినోళ్లంతా ఇంటికే.. ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్‌పై ట్రోల్స్
దేశంలో నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్న క్రమంలో సోషల్ మీడియాలో పలు పార్టీలు, పార్టీల నేతలపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై ట్రోల్స్ దర్శనం ఇస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్, అస్సోంతో పాటు పుదిచ్చేరి ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు పార్టీలు, పార్టీల నేతలపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై ట్రోల్స్ దర్శనం ఇస్తున్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తరవాత దేశరాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించిన ప్రాంతీయ పార్టీల సీఎంలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. బీజేపీపై యుద్ధానికి ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి ఓ కూఠమిగా వెళ్లాలని అప్పట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో కేసీఆర్ కొన్ని రాష్ట్రాల సీఎంలను కలవగా ఇప్పుడు వాళ్లు ఓడిపోవడంతో ట్రోల్స్ చేస్తున్నారు. కేసీఆర్ కలిసినవారిలో మమతా బెనర్జీ, స్టాలిన్ పార్టీలు తాజాగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయాయి. అదే విధంగా జగన్, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్‌లను సైతం కేసీఆర్ గతంలో కలిశారు. వారు కూడా ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉన్నారు. దీంతో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటూ నెట్టింట ట్రోల్స్ దర్శనం ఇస్తున్నాయి. ఆ ట్రోల్స్ కు బీఆర్ఎస్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్‌ను విజయ్ కలిశాడని ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తున్నాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాంగ్రెస్‍లో పవర్ ఫుల్ లీడర్‍గా రేవంత్ రెడ్డి.. అధిష్టానం వద్ద పెరిగిన గ్రాఫ్






