- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: బలవంతంగా ఏకగ్రీవం చేసుకునే గ్రామాలపై EC ఫోకస్
పంచాయతీ ఎన్నికల(Telangana Sarpanch Elections) నిర్వహణపై ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల(Telangana Sarpanch Elections) నిర్వహణపై ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేసింది. కాగా, సర్పంచ్ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్అధికారిని నియమించారు.
21 ఏండ్ల వయస్సు ఉన్న వారు, అదే గ్రామంలో ఓటరుగా నమోదైన వారు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేవారు (జనరల్) రూ.2వేలు డిపాటిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.వెయ్యి డిపాజిట్కింద చెల్లించాలి. వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు (జనరల్) రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 డిపాజిట్ చెల్లించాలి. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. డిసెంబర్3న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్11న పోలింగ్జరగనుంది. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్రాణి కుముదిని, కార్యదర్శి మకరంద్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీక్షించారు.






