సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ సమీక్ష

by Muthe.Rajitha |   (  Updated:2025-11-26 12:41:40  IST  )

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. భద్రత అంశాలు, ఎన్నికల కోడ్ అమలు, సామగ్రి తరలింపు వంటి కీలక అంశాలపై కమిషనర్ పలు సూచనలు చేసారు. ఇక మూడు దశల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో నవంబర్ 27న మొదటి దశకు చెందిన నామినేషన్లు మొదలు కానున్నాయి.

గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు దశల్లో అనగా.. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనుండగా.. మొత్తం 12,728 పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. 1.66 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల అధికారులకు శిక్షణ కూడా ముగిసింది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయని సమాచారం.

Next Story