- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐఆర్ ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)పై విజయవంతం చేయాలని తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)పై విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణలో ఈనెల 25వ తేది నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, దీనిని ప్రశాంతంగా నిర్వహించేందుకే మంగళవారం నాడు ప్రధాన ఎన్నికల కార్యాలయం (బీఆర్కేభవన్)లో రాష్ట్రంలోని అన్ని ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్ఓ) ఈ శిక్షణ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ లిస్టులో చేర్చాలని, అదేవిధంగా అనర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఈ శిక్షణ కార్యక్రమంతో ఎన్నికల అధికారుల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రత్యేకించి ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన బీఎల్‌ఓ యాప్‌తో కూడిన ఈసీఐనెట్ అప్లికేషన్‌పై వారికి సమగ్ర అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్ అమలు సమయంలో ఎదురయ్యే సవాళ్లపై పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సిఇఒ సూచించారు. అనంతరం రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి బి. చెన్నయ్య, ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని వివిధ దశలను సవివరంగా వివరించారు. పీఎం-ఐటీ డి. చిరంజీవి, ఈసీఐనెట్ బీఎల్‌ఓ యాప్‌కు సంబంధించిన సాంకేతిక శిక్షణను అందించారు. ఇందులో ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పూరించడం, ఓటర్ల మ్యాపింగ్, సేకరించలేని ఎన్యూమరేషన్ ఫారమ్‌ల వర్గీకరణ, అలాగే ఇతర అనుబంధ కార్యకలాపాల విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం. సత్యవాణి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి (ఎఫ్‌ఏసీ) ఎఎస్. చారిలతో పాటు నోడల్ అధికారులు, సంబంధిత సిబ్బంది కూడా పాల్గొన్నారు.






