త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల

by Naga Rani Yarlagadda |

తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో SIR నిర్వహించేందుకు కేంద్రఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సహా.. 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో నకిలీ ఓట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన వేళ.. నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల లిస్టును ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ SIRను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో SIRకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ లో ఈ ఎస్ఐఆర్ ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు, శిక్షణా కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణలో రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణలో ఈ ప్రక్రియకు సంబంధించి మే 2026 నాటికి క్షేత్రస్థాయి పనులు వేగవంతం కానున్నాయి. 2002 నాటి పాత డేటాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే పనిని అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మరీ రివిజన్ లో కేవలం మార్పులు, చేర్పులు మాత్రమే చేస్తారు. కానీ SIR అనేది కాస్త లోతైన ప్రక్రియ. బూత్ లెవల్ ఆఫీసర్లు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో వెరిఫై చేస్తారు. ఆధునిక సాంకేతికతను (AI/De-duplication software) ఉపయోగించి ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న ఓట్లను గుర్తిస్తారు. పట్టణీకరణ వల్ల ప్రాంతాలు మారినవారి ఓట్లను సరిచేసేందుకు SIR ఉపయోగపడుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్ లో SIR ప్రక్రియను కేంద్రఎన్నికల సంఘం పైలట్ ప్రాజెక్టుగా పూర్తిచేసింది. రెండవ దశలో భాగంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియను చేపట్టి.. ఫిబ్రవరిలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

Next Story