సూర్యకు జోడీ గా మమిత.. ట్రోలింగ్స్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు జంటగా నటిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.

సూర్యకు జోడీ గా మమిత.. ట్రోలింగ్స్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు జంటగా నటిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఇందులో సూర్య, మమితా బైజు మధ్య ఉన్న ఏజ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందిచి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చూసి థియేటర్ల నుండి బయటకు వస్తున్నప్పుడు, ఈ చిత్రం నైతికంగా ఎక్కడా తప్పుగా అనిపించదు. అంతే కాకుండా మీకు ఎంతో సంతృప్తిని కూడా కలిగిస్తుంది.. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు సూర్య సార్‌తో మమితా జంటగా ఎలా నటిస్తారు అని మీమ్స్, రీల్స్, నెగిటివ్ కామెంట్స్‌తో చర్చ జరగడం నేను చూశాను. హీరోయిన్ ఎంపిక గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారని సూర్య సార్ కూడా అన్నారు. ఈ పాత్ర కోసం మమితను ఎందుకు ఎంచుకున్నామో మాకు మాత్రమే తెలుసు. కానీ టీజర్ విడుదలయ్యాక అందరూ ఆ నిర్ణయాన్ని అంగీకరించారు.. అలాగే సినిమా రిలీజ్ తర్వాత కరెక్ట్ చాయిస్ అని కూడా ఒప్పుకుంటారు’ అని తెలిపారు. అలాగే ఈ సినిమా కథ విషయంలో జ్యోతిక సహాయం చేసిన దానిపై మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి సంబంధించి జ్యోతిక గారికి కథను వినిపించడం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆమెకు ఈ కథాంశం బాగా నచ్చింది.. ముఖ్యంగా ప్రథమార్థం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఆమె కొన్ని సూచనలు కూడా చేశారు. నేను చాలా మందికి ఈ స్క్రిప్ట్ వినిపించినప్పటికీ, జ్యోతిక గారి నుండి వచ్చిన స్పందన, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఆమె సూచించిన మార్పు ఏమిటన్నది సినిమా విడుదలయ్యాక వెల్లడిస్తాను’ అని చెప్పుకొచ్చారు.

Next Story