BRS: బీఆర్ఎస్‌కు భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం.. ఎందుకంటే?

by Ramesh Naini |

బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానించించింది.

BRS: బీఆర్ఎస్‌కు భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) ఆహ్వానించించింది. ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 5, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో తాను నిర్వహించనున్న సమావేశానికి (BRS) బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) అధికారికంగా ఆహ్వానించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి, ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మొహాల్ అధికారిక ఆహ్వాన లేఖ పంపారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షుడికి కూడా పంపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) నేతృత్వంలో పార్టీ కీలక నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత బాల్క సుమన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా, ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story