Jubilee Hills Bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం

by Malleboina Mahesh |   (  Updated:2025-10-15 05:59:28  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటీ గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అయింది.

Jubilee Hills Bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటీ గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నికకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు షెడ్యూల్ విడుదల అయిన తెలిసిందే. కాగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, గెలుపే లక్ష్యంగా చేసుకొని ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిషితంగా పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ (Exit polls) పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11 వ తేదీ సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం (Ban on exit polls) విధిస్తున్నట్టు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ నిషేధం అన్ని రకాల పేపర్లు, టీవీలు, రెడియే, పత్రికలు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు, ప్రచార మాద్యమాలకు వర్తిస్తుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అలాగే ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండు విదించే అవకాశం ఉన్నట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ నవంబర్ 11న జరగనుంది.

Next Story