ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్.. శాలరీ విడుదల చేస్తూ సర్కార్ జీవో జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 04:33:46  IST  )

ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత దీపక్‌రెడ్డి (Deepak Reddy) జీతం వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది.

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్.. శాలరీ విడుదల చేస్తూ సర్కార్ జీవో జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత దీపక్‌రెడ్డి (Deepak Reddy) జీతం వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఆయన వేతన బకాయిలను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది. అయితే, ఇటీవల రాష్ట్రంలో ఐఏఎస్‌ (IAS)లపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.

ఐఏఎస్‌లపై ఆయన ఏమన్నారంటే..

కలెక్టర్లు రాష్ట్ర వ్యవస్థకు గ్రహణం, దరిద్రం పట్టినట్లుగా పట్టారని ఎమ్మెల్సీ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ చైర్మన్ గునపటి దీపక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 14 నెలలుగా తనకు జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే విషయంలో ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా తన ఫైల్ క్లియర్ చేయడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇన్ని నెలలుగా ఒక్క ఫైల్ క్లియర్ చేయలేని అధికారికి ఆ సీటులో కూర్చునే అర్హత లేదని దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. IAS అధికారులు, వారు తమ అవినీతి కోసమే పనుల్లో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దొంగలు IAS వ్యవస్థలోనూ ఉన్నారంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. కలెక్టర్లు డ్రామాలు చేస్తూ నీతులు మాట్లాడుతున్నారని.. ఏమీ రోగం వచ్చిందోనని విమర్శించారు. అదేవిధంగా IAS అధికారులు, కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే 2019లో చంద్రబాబు, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారని కామెంట్ చేశారు. అయితే తాజాగా, దీపక్‌ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ బ్యూరోక్రసీలో హాట్ టాపిక్‌గా మారాయి.

అప్రమత్తమైన ప్రభుత్వం

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవ్వడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన ఆయన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నిధుల విడుదలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More..

కాసేపట్లో BRS సమాంతర అసెంబ్లీ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్, హరీశ్‌రావు

Next Story