ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా ఈదురు వెంకన్న

by Gantepaka Srikanth |

ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా ఈదురు వెంకన్న

ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా ఈదురు వెంకన్న
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని శుక్రవారం ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా తిరిగి మరోసారి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ఎంపికయ్యారు. వైస్ చైర్మన్ గా టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, కన్వీనర్ గా ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శి మౌలానా, కో కన్వీనర్లుగా బీకేయూ ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య, బీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, కేపీ ప్రధాన కార్యదర్శి బీ యాదగిరి, కోశాధికారిగా టీఎంయూకు చెందిన బి.యాదయ్య, మీడియా ఇంచార్జులుగా పాటి అప్పారావు (ఈయూ), ఎన్ కమలాకర్ గౌడ్ (టీఎంయూ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నగరంలోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, యూనియన్ నేషనల్ మజ్దూర్, యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ పాల్గొన్నాయి. ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆరు సంఘాలు జేఏసీగా ఏర్పడడానికి నిర్ణయించినట్లు నూతన జేఏసీ తెలిపింది. నూతన జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిత్యం ఎదురుకొంటున్న అధిక పని భారం, వేధింపులు, ప్రభుత్వం- యాజమాన్యాల కార్మిక వ్యతిరేక విధానాలపై, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై దశల వారి పోరాటాలు నిర్వహించాలని తీర్మానించినట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ సుద్దాల సురేష్, బుద్ధ విశాల్, బి యాదగిరి తెలిపారు.. సమావేశంలో నేతలు ఎం వెంకట్ గౌడ్, జే రాఘవులు, ఎన్ బాలిరెడ్డి, ఆర్ఎన్ రెడ్డి, వీ బాబు, జి.రాములు, రాంచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story