విద్యా సంస్థలు vs విజిలెన్స్ అధికారులు

by Muthe.Rajitha |

తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు vs విజిలెన్స్ అధికారుల పంచాయితీ నడుస్తోంది.

విద్యా సంస్థలు vs విజిలెన్స్ అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు vs విజిలెన్స్ అధికారుల పంచాయితీ నడుస్తోంది. తమకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే విద్యాసంస్థల సంపూర్ణ బంద్ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. దసరాకు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇకనైనా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలరిషిప్స్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు ఉన్నత విద్యాసంస్థలు, ప్రొఫెషనల్ కాలేజీల్లో విద్యార్థులు సంఖ్య, సౌకర్యాలపై తనిఖీలు చేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అయితే తాము బకాయిలు అడిగితే తనిఖీలు చేయడం ఏమిటని మండిపడుతున్నాయి విద్యాసంస్థలు. ముందు బకాయిలు విడుదల చేసి, ఆ తరువాతే తనిఖీలు చేపట్టాలని చెబుతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం తమను వేధిస్తోందని, తనిఖీలు ఆపి, పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ తో ఛలో హైదరాబాద్ చేపట్టి, భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాయి.

అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నామని, తనిఖీలపై తాము నివేదిక ఇవ్వాల్సి ఉందని.. తమ పని తాము చేస్తామని అంటున్నారు. మరోవైపు SFI ఈ పెండింగ్ బకాయిల విషయంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ కు పిలునిచ్చింది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు వర్సెస్ విజిలెన్స్ అధికారులు అన్నట్టు తయారైంది.

Next Story