అభివృద్ధికి మూలం విద్య మాత్రమే : ఎంపీ గోడం నగేష్

by Taduka Kalyani |

మానవ అభివృద్ధికి మూలం విద్య మాత్రమేనని పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు.

అభివృద్ధికి మూలం విద్య మాత్రమే : ఎంపీ గోడం నగేష్
X

దిశ, నార్నూర్(గాదిగూడ) : మానవ అభివృద్ధికి మూలం విద్య మాత్రమేనని పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. సోమవారం గాదిగూడ మండలంలోని లోకారి గ్రామంలో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.

గిరిజన ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలో గతంలో నిర్మించిన లోలెవల్ వంతెనల వల్ల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని ఎంపీ, కలెక్టర్ లను కోరారు. సాగునీటి సమస్య కూడా మండలంలో అధికంగా ఉందని తెలిపారు.

విద్యార్థులు ప్రతి రోజు బడికి వెళ్ళాలి: కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థులు ప్రతి రోజు బడికి వెళ్లడం ద్వారా నూతన విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి జరిగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుష్పలత, డిఈవో మాధవి, ఎంఈవో రమేష్, హేడ్ మాస్టర్ దిలీప్, మెస్రం శేఖర్ బాబు, సిఆర్పి గోవింద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోషకులు పాల్గొన్నారు.

Next Story