- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్.. సమగ్ర శిక్ష సిబ్బందికి ఇక 'ఫేషియల్' హాజరు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష కార్యాలయాల్లో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష కార్యాలయాల్లో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, వివిధ కార్యాలయాల అధికారుల కోసం ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను, సంబంధిత కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి వివరాలను డిసెంబర్ 28 లోపు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వివరాలను అటు సాఫ్ట్ కాపీ రూపంలోనూ, ఇటు హార్డ్ కాపీ రూపంలోనూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని పేర్కొంది.
ఇప్పటికే పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు క్షేత్రస్థాయి, పరిపాలనా యంత్రాంగంలో కూడా దీనిని ప్రవేశపెడుతోంది. దీనివల్ల కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన మెరుగుపడుతుందని, విధుల్లో జాప్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త హాజరు విధానం హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీఎస్ఈ కార్యాలయాలు, అన్ని డైట్ కాలేజీలు, డీఈఓ కార్యాలయాలు, ఎంఈఓ కార్యాలయాల సిబ్బందికి వర్తించనుంది. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది అందరూ ఈ విధానం కిందకు రానున్నారు.






