- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే.. CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన
తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషనర్ కీలక సూచనలు చేసింది. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు రద్దుకు సూచనలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషనర్ కీలక సూచనలు చేసింది. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు రద్దుకు సూచనలు చేసింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంది. దాంతో పాటు ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని స్పష్టం చేసింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే ఏకంగా సర్వీసు నుంచి తొలగించాలని సూచించింది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకూ కొత్త నిబంధనలు సూచించింది. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది. డీఈఐఈడీ కోర్సు రద్దు చేయాలని తెలిపింది.
మరోవైపు.. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం సమర్పించిన ’తెలంగాణ విద్యా విధానం 2026: సమగ్ర విద్యా దృక్పథం’ నివేదికపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.






