Ponnam: హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రిగా మూడు అంశాలకు ప్రయార్టీ: మంత్రి పొన్నం

by Prasad Jukanti |   (  Updated:2025-06-20 08:09:11  IST  )

హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రిగా మూడు అంశాలకు ప్రయార్టీ ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Ponnam: హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రిగా మూడు అంశాలకు ప్రయార్టీ: మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మా ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని పేదలకు నాణ్యమైన విద్య వైద్యం ఉచితంగా అందించేలా పని చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ హైదరాబాద్ చింతల్ బస్తి అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్యం వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా నేను, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆసుపత్రులు, పాఠశాలలు,హాస్టల్ లలో తనిఖీలు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. వర్ష కాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజన్ మారుతున్న సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్ లో ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని ఏ సమస్య ఉన్న స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Next Story