- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీసు వద్ద పెద్ది ఊచకోత.. తొలిరోజే రూ.100 కోట్లు క్రాస్!
పెద్ది మూవీ తొలిరోజే రూ.100 కోట్లు క్రాస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరిశారు. జగపతిబాబు ప్రత్యేక పాత్రలో చేయగా... ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా, నిన్న రిలీజ్ అయింది. బుధవారమే ప్రీమియర్లు పడిపోయాయి. సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో థియేటర్లలో చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
అయితే ఈ క్రమంలోనే పెద్ది సినిమా తొలి రోజు కలెక్షన్స్ వైరల్ గా మారాయి. మొదటి రోజు రూ. 110 కోట్ల గ్రాస్ సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలో రూ. 80 కోట్ల గ్రాస్ సాధించగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 67 కోట్ల వసూలు రాబట్టిందని పేర్కొంటున్నారు. ఇక ఓవర్ సీస్ లో రూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లు రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో తొలిరోజే రూ. 100 కోట్ల గ్రాస్ దాటిన 11వ సినిమాగా పెద్ది రికార్డుల్లోకి ఎక్కింది.






