- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs AFG: విరాట్ కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్?
విరాట్ కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ స్థానం దక్కనున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా... ఆ తర్వాత మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదని నిన్నటి నుంచి కథనాలు వస్తున్నయి. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నాడట. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సంజు శాంసన్, సాయి సుదర్శన్ ఇలాంటి పేర్లను పరిశీలించినప్పటికీ...హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం.. రుతురాజ్ గైక్వాడ్ కే మొగ్గు చూపినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఐపీఎల్ టోర్నమెంట్లో ప్రదర్శన ఆధారంగా వన్డేల్లోకి తీసుకోకూడదని గౌతమ్ గంభీర్ వాదిస్తున్నారట. కాగా ఇండియా తరఫున ఇప్పటి వరకు 9 వన్డేలు ఆడాడు రుతురాజ్. ఈ నేపథ్యంలో 228 పరుగులు సాధించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై సెంచరీ కూడా బాదాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా వన్డే సిరీస్ కు డౌట్ అనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే రోహిత్ శర్మ కూడా దూరమైతే, సాయి సుదర్శన్ లేదా సంజు శాంసన్ లలో ఒకరికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది.






