- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జననాయగన్ రిలీజ్.. ప్రొడ్యూసర్లకు సీఎం విజయ్ ట్విస్ట్!
జననాయగన్ థియేట్రికల్ రైట్స్ డీల్ ను క్యాన్సిల్ చేసుకోమని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ కు సీఎం విజయ్ రిక్వెస్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ సినిమా జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా... అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, విజయ్ సీఎం అయిన నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి క్రమంలో ఈ సినిమా రిలీజ్ పై మరో న్యూస్ హాట్ టాపిక్ అయింది.
డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్ ను క్యాన్సిల్ చేసుకోమని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ కు సీఎం విజయ్ రిక్వెస్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వారికి రిఫండ్ చేసి సొంతంగానే రిలీజ్ చేసుకోమని సూచనలు చేశారట. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు ఈ నెల 22వ తేదీన ఉంది. ఈ క్రమంలో జూన్ 18వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ఇప్పటి నుంచి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు విజయ్ అభిమానులు.






