సూర్యపై వేటు, అత‌డే టీ20 కొత్త కెప్టెన్.. నేడే అధికారిక‌ ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

సూర్యపై వేటు, టీ20 కొత్త కెప్టెన్ గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌.

సూర్యపై వేటు, అత‌డే టీ20 కొత్త కెప్టెన్.. నేడే అధికారిక‌ ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే సూర్య కుమార్ యాదవ్ పై వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియామకం చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు ఇప్పటికే డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని ఇవాళ జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు జట్టు ఎంపిక కోసం శనివారం జరిగే సెలక్షన్ మీటింగ్ కు శ్రేయస్ అయ్యర్ కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ నెల 26వ తేదీ నుంచి ఐర్లాండ్ సిరీస్ లో అయ్యర్ కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నట్లు సమాచారం. అయితే కెప్టెన్సీ పదవితో పాటు... సూర్య కుమార్ యాదవ్ కు జట్టులో కూడా స్థానం దక్కేది డౌట్ అంటున్నారు. అతన్ని పక్కకు పెట్టి, మరో ప్లేయర్ కు అవకాశం ఇవ్వబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సూర్య స్థానంలో రజత్ పాటిదార్ ను పరిగణలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story