- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌభాగ్య ఇస్పాత్ కంపెనీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
సౌభాగ్య ఇస్పాత్ కంపెనీ ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. పీఎంఎల్ఏ కేసుల్లో రూ.26.86 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని తాత్కాలికంగా జప్తుచేసినట్లు తెలిపింది.

- రూ.26.86 కోట్ల ఆస్తులు జప్తు
- స్టీల్ తయారి యూనిట్ పేరుతో నకిలీ స్టేట్మెంట్‌తో బ్యాంక్ నుంచి రుణాలు
దిశ, తెలంగాణ బ్యూరో : నకిలీ స్టాక్ స్టేట్‌మెంట్‌లు సమర్పించి రుణాలు పొంది మోసానికి పాల్పడ్డ సౌభాగ్య ఇస్పాత్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆస్తులను హైదరాబాద్ జోనల్ కార్యాలయ ఈడీ అధికారులు జప్తు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ( పిఎంఎల్ఎ)కింద కేసుల నమోదు చేసి రూ.26.86కోట్ల విలువైన స్థిరాస్తులను శుక్రవారం తాత్కలింగా జప్తు చేసినట్లు పేర్కొన్నారు. సౌభాగ్య ఇస్పాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆంధ్రా బ్యాంక్)ను రుణాల పేరుతో మోసం చేసి నష్టం కలిగించినందుకు ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్ల వెల్లడించారు. ఎస్ఐఐపీఎల్ స్టీల్ తయారీ యూనిట్ స్థాపన పేరుతో బ్యాంక్ రుణాలు పోందేందుకు నకిలీ పత్రలు సృష్టించినట్లు ఈడీ దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. నకిలీ స్టాక్ స్టేట్‌మెంట్స్, నకిలీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సర్టిఫికెట్స్ రుణాలు పొందేందుకు బ్యాంక్‌కు సమర్పించినట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్యాంక్ నుంచి పొందిన రుణాలను స్వంత ప్రయోజనాలకు దారి మళ్లీంచారని పేర్కొన్నారు. రూ.46.52కోట్ల మోసాలకు పాల్పడగా రూ.15.52 కోట్లు రికవరీ జరిగిందని తెలిపారు. మిగిలిన రూ.31 కోట్ల రికవరీ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు తదుపరి దర్యాప్తు జరుతున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.






