చందానగర్‌లో రుణాల పేరుతో రూ.12.30 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. ఆస్తులు జప్తు చేసిన ఈడీ

by Ramesh Naini |

నకిలీ సబ్-కాంట్రాక్ట్ ఒప్పందాలు, వర్క్ ఆర్డర్లు, నకిలీ ఆస్తి పత్రాలు సమర్పించి, చందానగర్ శాఖ నుంచి సిండికేట్ బ్యాంక్ రుణం పొందిన కేసులలో హైదరాబాద్ ఈడీ కార్యాలయ అధికారులు ఆస్తుల జప్తు చేపట్టారు.

చందానగర్‌లో రుణాల పేరుతో రూ.12.30 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. ఆస్తులు జప్తు చేసిన ఈడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నకిలీ సబ్-కాంట్రాక్ట్ ఒప్పందాలు, వర్క్ ఆర్డర్లు, నకిలీ ఆస్తి పత్రాలు సమర్పించి, చందానగర్ శాఖ నుంచి సిండికేట్ బ్యాంక్ రుణం పొందిన కేసులలో హైదరాబాద్ ఈడీ కార్యాలయ అధికారులు ఆస్తుల జప్తు చేపట్టారు. బ్యాంకును మోసం కేసులో సుబ్బయ్య కొర్రపాటి సుమారు రూ.12.30 కోట్ల రుణ సౌకర్యాలు పొందినట్లు ఈడి అధికారులు గుర్తించి, రూ.2.91కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు స్థిరాస్తులను పీఎంఎల్‌ఏ, కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు తెలిపారు.

వాటిలో వ్యవసాయ భూమి, నివాస ప్లాట్లు, కమర్షియల్ అసెట్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తులు బినామీల పేరిట ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్ అవినీతి నిరోధక బ్యూరో, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రుణ నిధులను అసలు వ్యాపార అవసరాలకు వినియోగించకుండా, నకిలీ ఒప్పందాలు, నకిలీ బిల్లులు, రౌండ్-ట్రిప్పింగ్ లావాదేవీల ద్వారా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఎన్ఎస్ఐసీ పథకం కింద బ్యాంకు హామీలను దుర్వినియోగం చేసినట్లు ఈడీ తెలిపింది.

Next Story