- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రిషా పెరల్స్ పై ఈడి కేసు నమోదు
ప్రిషా పెరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పై పిఎంఎల్ఏ నిబంధనల మేరకు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు హైదరాబాద్ ఈడి కార్యాలయ అధికారులు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రిషా పెరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పై పిఎంఎల్ఏ నిబంధనల మేరకు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు హైదరాబాద్ ఈడి కార్యాలయ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిచిన వివరాలు బుధవారం వెల్లడించారు. పోస్టల్ డిపార్టమెంట్ ను మోసం చేసిన ఘటన పై సీబీఐ , ఏసిబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రిషా పెరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్లు నీలేష్ కుమార్ అగర్వాల్, శైలేష్ కుమార్ అగర్వాల్, గణశ్యామ్ జ్యూవెలర్స్, అగ్రవన్శీ అగ్రో ఫామ్ , గజనాంద్ అగర్వాల్ పై కేసు నమోదైనట్లు పేర్కోన్నారు. మోసపూరితంగా వస్తువులను వాల్యూ పేయబుల్ లెటర్ / వాల్యూ పేయబుల్ పోస్ట్ (విపిఎల్ /విపిపి ) కింద బుక్ చేసి, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు రూ. 7.66 కోట్ల తప్పుడు నష్టాన్ని కలిగించారని తెలిపారు.
పోస్టల్ స్టాంపుల వాడకాన్ని నివారించడానికి పోస్ట్ డిపార్ట్‌మెంట్ ‘రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్’ను ప్రవేశపెట్టిందని , రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మెషీన్‌లను ఉపయోగించడానికి ఆపరేటింగ్ విధానాలను కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రిషా పెర్ల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అటువంటి రెండు ఫ్రాంకింగ్ మెషీన్‌లను కొనుగోలు చేసిందని దర్యాప్తు వెల్లడైనట్లు తెలిపారు. వాటి ద్వారా విపిఎల్ /విపిపి నకిలీ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ స్లిప్‌ల ద్వారా పోస్టల్ శాఖను మోసం చేసినట్లు విచారణలో తెలిందని వెల్లడించారు. గతంలో ప్రిషా పెరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు , సంబంధిత సంస్థలకు చెందిన రూ.4.36 కోట్ల విలువైన బ్యాంక్ బ్యాలెన్స్‌లను అటాచ్ చేసినట్లు తెలిపారు.






