- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ముగిసిన ఈడీ సోదాలు..కీలక పత్రాలు స్వాధీనం
హైదరాబాద్ పాతబస్తీలో ఉదయం నుండి 13 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో ఉదయం నుండి 13 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భూదాన్ ల్యాండ్ కేసులో వ్యాపారవేత్త మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, షుకూర్ ఇండ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మహేశ్వరం ల్యాండ్ విషయంలో భూదాన్ భూమిని అక్రమంగా లేఔట్ చేసి అమ్మడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఉదయం తనిఖీలు ప్రారంభించగా తాజాగా పూర్తైనట్టు తెలుస్తోంది. మునావర్‌కు చెందిన 40 వింటేజ్ కార్లతో పాటూ ఆయన ఇంట్లో భారీగా భూదాన్ భూముల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మునావర్ ఖాన్ వందల ఎకరాలు కబ్జా చేసి రియల్టర్లకు, అధికారులకు అమ్మినట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే ఈఐపీఎల్ కంపెనీ పేరుతో భూదాన్ భూముల్లో అక్రమ వెంచర్లు వేసి ఐఏఎస్,ఐపీఎస్‌లకు సైతం భూములు విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కేసులో ఇప్పటికే అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ లను ఈడీ విచారించింది.






