- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్ నగరంలో ఈడీ అధికారుల సోదాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారు జామున ఈడీ అధికారులు దాడులు (ED officials raid) నిర్వహించారు. సురానా గ్రప్ (Surana Group) చైర్మన్, డైరెక్టర్‌ల ఇళ్లలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో నగరంలోని సికింద్రబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో.. సురానా గ్రప్ చైర్మన్, డైరెక్టర్‌లకు సంబంధించిన ఇళ్లు ఆఫీసుల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. సురాన గ్రూప్ చైర్మన్ నరేందర్, ఎండి దేవేందర్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ (Money laundering)తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. అలాగే సాయిసూర్య డెవలపర్స్ (Saisurya Developers) ఎండీ సతీష్ నివాసంలో కూడా ఈడీ సోదాలు (ED searches) కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం పది చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సురానా గ్రూప్‌కు అనుబంధంగా సాయిసూర్య కంపెనీ పనిచేస్తుంది. వీరు హైదరాబాద్‌లో పలు కంపెనీలకు ఈ సంస్థలు భూములను అమ్మారు. చెన్నై SBI నుంచి సురానా గ్రూప్ వేల కోట్లు రుణాలు తీసుకుంది. 2012లో సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా.. 400 కేజీల బంగారాన్ని నాటి సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 103 కేజీల బంగారం మాయం అయింది. సీబీఐ కస్టడీ నుంచి 103 కిలోల బంగారం మాయం అయిందో తేల్చాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సురానా గ్రప్.. రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. పవర్ సెక్టార్‌లోను బిజినేస్ చేస్తున్నాయి.