- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sheep scam: గొర్రెలు.. రూ. 1000 కోట్లపైనే! గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ప్రకటన చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన మరో అవినీతి బట్టబయలు అవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. ఈ పథకం అక్రమాల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని ఈడీ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. సోదాల అనంతరం 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డ్స్ సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని విచారణలో తెలినట్లు వెల్లడించారు.
నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లింపు..
గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం 7 జిల్లాల్లోనే రూ.253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉందని, కానీ, 33 జిల్లాలు కలిపి చూస్తే రూ. 1000కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు తెలిపిందని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఈడీ ప్రకటించింది. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని పేర్కొన్నారు. కాగా, ఈ కేసును మనీలాండరింగ్ కోణంలో విచారించిన ఈడీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని 8చోట్ల సోదాలు చేశారు. పశు సంవర్ధక శాఖ అధికారులు, దళారులు, గతంలో అరెస్ట్ అయిన వ్యక్తుల ఇళ్లతో పాటు నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లోనూ తనిఖీలు చేశారు.
గత ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించగా రెండు విడతలుగా సుమారు రూ.4.25 లక్షల యూనిట్లను పంపిణీ చేసినట్లు చూపించారు. ఇందుకోసం దాదాపు రూ.4 వేల కోట్లు మంజూరు చేశారు. అయితే కొన్ని యూనిట్లనే పంపిణీ చేసి.. ఎక్కువ కొన్నట్లు చూపడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఈ క్రమంలోనే కుంభకోణం జరిగిందంటూ గతంలోనే కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అప్పట్లోనే 17 మందిని అరెస్టు చేశారు. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో గతేడాది జూన్‌లో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.






