తెలంగాణలో ఈడీ హడావుడి: విచారణలో కరువైన పురోగతి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఏసీబీ, సీఐడీ డిపార్ట్మెంట్‌లు నమోదు చేస్తున్న కేసుల వివరాలను ఈడీ తీసుకుని ఎన్ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్..

తెలంగాణలో ఈడీ హడావుడి: విచారణలో కరువైన పురోగతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఏసీబీ, సీఐడీ డిపార్ట్మెంట్‌లు నమోదు చేస్తున్న కేసుల వివరాలను ఈడీ తీసుకుని ఎన్ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడం తప్ప కేసుల్లో పురోగతి ఏ మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆ శాఖ అమలు చేస్తున్న శిక్షలు పర్సెంటేజీ 0.1శాతంగా ఉందని తేలింది. గత పదేళ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో విచారణ ముందుకెళ్లడం లేదని తెలుస్తున్నది. అధికారుల కొరత, అధిక మొత్తం లో నమోదవుతున్న కేసులతో శిక్ష విధిం పులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇదివరకు ఈడీ విచారణ చేస్తుం దంటే రాష్ట్ర స్థాయిలో అధికారులు హడలెత్తేవారని ప్రస్తుతం జరుగుతున్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంతో ఆ పరిస్థితులు లేవని తెలుస్తున్నది.

8 కేసుల్లో 15 మందికి మాత్రమే శిక్ష..

దేశవ్యాప్తంగా 2015 నుంచి 2025 వరకు ఈడీ నమోదు చేసిన కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ) చట్టం కింద ప్రత్యేక కోర్టులు 8 కేసుల్లో మాత్రమే 15 మందికి శిక్ష విధించినట్టు ఇటీవల కేంద్రం వెల్లడించింది. నమోదైన కేసుల్లో శిక్ష శాతం 0.1% మాత్రమే అమలు జరిగినట్లు తెలు స్తుంది. గత పదేళ్ల కాలంలో పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ 5,892 కేసులు దర్యాప్తు చేయగా.. 49 కేసుల్లో క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేసింది. ఈడీ చేపట్టిన 24% కేసుల్లో దర్యాప్తు దశకు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం 5% కేసులు మాత్రమే విచారణ దశకు వస్తున్నట్లు తెలుస్తుంది. 2019 నుంచి 2024 మధ్య 654 కేసులు విచారణ పూర్తి కాగా, 42 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డా యి. శిక్ష శాతం 6.42 మాత్రమే నమోదైనట్లు తెలుస్తున్నది. గత పదేండ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో 77% విచారణలో కోర్టులకు సరైన ఆధారాలు సమర్పించ లేకపోవడం వల్ల కేసులు దాఖలు చేయలేదని స్పష్టం అవుతున్నది.

ఈడీ 2024–25 రిపోర్ట్

ఈడీ అధికారులు విడుదల చేసిన 2024–25 రిపోర్టులో 461 ఆస్తులను అటాచ్ చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసుకుంది. రూ.18.37 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 214 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 34 కేసుల్లో నేరారోపణలు రుజువు అయ్యాయి. 775 ఈసీఐఆర్‌లను నమోదు చేశారు. 333 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను నమోదు చేశారు.

రాష్ట్రంలో ఈడీ హల్‌చల్.. 2024 జనవరి నుంచే..

రాష్ట్రంలో ఈడీ అధికారుల హడావుడి 2024 ప్రారంభం నుంచే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. ఏసీబీ, సీఐడీ అధికారులు కేసులు నమోదు చేయడం ఈడీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్రంలో జరిగిన గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ కార్ రేస్, హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్‌లో అక్రమాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు, ఇరిగేషన్ శాఖలో ఏసీబీకి పట్టుబడిన అధికారులు, రియల్ ఎస్టేట్ మోసాలపై నమోదైన కేసుల్లో ఇప్పటివరకు ఈడీ ఎంటర్ అయ్యింది. తాజాగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమాలపై గోపాలపురం పోలీసులకు ఈడీ లేఖ రాసింది. కేవలం హెచ్సీఏ అక్రమాలలో రూ.51లక్షల ఆస్తులు జప్తు చేయడం మినహా ఈడీ అధికారులు రాష్ట్రంలో జరిగిన కేసులపై పురోగతి సాధించలేదు.

పురోగతి లేని ఫార్ములా ఈ కార్, గొర్రెల స్కామ్‌ కేసు..

ఫార్ములా ఈ కార్ రేస్ విచారణలో ఏసీబీ నుంచి వివరాలు సేకరించి ఈడీ దర్యాప్తు చేపట్టి కేవలం నిందితుల విచారణతో సరిపెట్టింది. గత ఏడు నెలల కాలంలో కేసు దర్యాప్తు గురించి ఎటువంటీ ప్రకటన చేయలేదు. గొర్రెల స్కామ్‌‌లో కూడా ఎలాంటి పురోగతి లేదు. రూ.1000 కోట్ల స్కామ్ జరిగినట్లు ప్రకటన చేసింది. 200 బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎటువంటి ఆస్తుల జప్తులు, నేరాల నిరూపణ జరగలేదు. ఫాల్కన్ స్కామ్‌లో రూ.18.12 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఆగస్టు 1న ఈడీ ప్రకటించింది. ఈ కేసులో రూ.792 కోట్ల మేర బాధితులు నష్టపోయినట్లు ఈసీఐఆర్‌లో పేర్కొంది. రియల్ ఎస్టేట్ కంపెనీ మోసాలపై ఈడీ కేసులు, విచారణ జప్తులు అంతంత మాత్రమే అని తెలుస్తున్నది. సాహితి ఇన్ఫ్రా, సాయి శ్రీ, సూర్య డెవలపర్స్ కేసులలోనూ ఇదే పరిస్థితి. ఎంబీఎస్ జ్యువెలర్స్, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసుల్లోనూ పురోగతి కనిపించడం లేదు.

Next Story