- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో ఛార్జిషీట్ దాఖలు
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం ఈడీ మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్ర, రాజేశ్ జోషిలపై ఈడీ ఛార్జిషీట్ వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన నిందితుల విచారణకు సంబంధించిన అంశాలను ఈ చార్జీషీట్‌లో ఈడీ ప్రస్తావించింది. ఫిబ్రవరి 7వ తేదీన గౌతమ్ మల్హోత్ర, 8న రాజేశ్ జోషి, 10న మాగుంట రాఘవను అరెస్ట్ చేసినట్టు ఈ ఛార్జిషీట్‌లో ఈడీ తెలిపింది. ఈ అనుబంధ ఛార్జిషీట్‌పై ఈ నెల 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలో, లేదో అనే విషయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చనుంది.






