సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను కస్టడికి కోరిన ఈడీ.. నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్

by Ramesh Naini |

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసీ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ అత్తూలూరి నమ్రతను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చెపట్టింది.

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను కస్టడికి కోరిన ఈడీ.. నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసీ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ అత్తూలూరి నమ్రతను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చెపట్టింది. ఐదు రోజుల కస్టడీ కోరుతూ మంగళవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేద గిరిజన మహిళల నుంచి కొనుగోలు చేసి, వాటిని సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా నకిలీ పత్రాలు సృష్టించి దంపతులకు విక్రయించినట్లు ఈడి దర్యాప్తులో పేర్కొంది. కేసులో సుమారు రూ. 30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఈడీ గుర్తించింది.

ఎనిమిది బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సరోగసీ ముసుగులో హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ, స్వదేశీ దంపతుల నుంచి సరోగసీ సేవల పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ. 30 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు ఆమెను ఈ నెల 12న అరెస్టు చేశారు. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఆమెకు 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Next Story