కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లపై ఈడీ నజర్!

by Muthe.Rajitha |

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతికి పాల్పడిన ఇంజనీర్ల వ్యవహారంపై ఈడీ(ED) దృష్టి పెట్టింది.

కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లపై ఈడీ నజర్!
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతికి పాల్పడిన ఇంజనీర్ల వ్యవహారంపై ఈడీ(ED) దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పలు అనుమతులు, చెల్లింపుల కోసం భారీగా లంచాలు తీసుకున్న ఈ అధికారుల చిట్టా విప్పనుంది. వీరంతా అవినీతి సొమ్మును సొంత కంపెనీలకు మళ్లించి, భారీగా అక్రమార్జన చేసారని ఏసీబీ దాడుల్లో బయటపడగా.. వారి వివరాలు సమర్పించాలని ఏసీబీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం అక్రమాల్లో బయటికి వచ్చిన నీటిపారుదలశాఖ తాజా, మాజీ ENC లు నూనె శ్రీధర్, హరిరాం నాయక్, మురళీధర్ రావుల ఆస్తుల చిట్టాపై ఈడీ దర్యాప్తు చేయనుందని సమాచారం.

ఇటీవలే వీరుముగ్గురు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. వీరి ముగ్గురు ఆస్తులే రూ.1000 కోట్లకు పైగా ఉండటంతో ఇక ఈ అవినీతి ఎంత పెద్దది అయి ఉండవచ్చునో అని జనాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Next Story