- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్లో ఈడీ మెరుపు దాడులు.. ఏక కాలంలో 15 బృందాల రెయిడ్
by Prasad Jukanti |
ఓ డ్రగ్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ రెయిడ్స్ చేస్తోంది. 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. హైదరాబాద్‍లో నమోదైన ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఇవాళ హైదరాబాద్, బెంగళూరులో మెరుపు దాడులు చేస్తున్నాయి. మొత్తం 15 బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో 7 చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల ఈ తనిఖీలు చెపట్టాయి. కోట్ల రూపాయల డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్‍లో నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్‍తో పాటు బెంగళూరులోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నిందిలను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా లింకుల ఆధారంగా ఈడీ బెంగళూరులో సోదాలు నిర్వహిస్తోంది. కాగా ఈ కేసులో డ్రగ్స్ పెడ్లర్లు, వినియోగదారులలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






