- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయిశ్రీ ఇంజనీర్స్ సంస్థపై ఈడీ కేసులు
సాయిశ్రీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాగిరాజు సూర్యనారాయణ కు చెందిన రూ.3.11 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను

దిశ, తెలంగాణ బ్యూరో:సాయిశ్రీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాగిరాజు సూర్యనారాయణ కు చెందిన రూ.3.11 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులనుఈడీ అధికారులు జప్తు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్ జోనల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడి) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీబీఐ ఎకానామిక్ ఆఫ్ వింగ్ (ఈవోడబ్ల్యూ) చెన్నైలో నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చెపట్టినట్లు వెల్లడించారు. జూలై 28వ తేదిన సీబీఐ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు తెలిపారు.
సాయిశ్రీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపిఎల్) వ్యస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ సాగిరాజు సూర్యనారాయణ రాజు నకిలీ, కల్పిత పత్రాలు, కల్పిత ఆస్తులను కొలేటరల్ సెక్యూరిటీలుగా చూపించడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసినట్లు గుర్తించారు. ఎస్‌బీఐకి రూ.7.51 కోట్లు నష్టం కలిగించారని పేర్కొన్నారు. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ నుండి రూ. 13.53 కోట్ల మొత్తాన్ని అందుకున్నట్లు ఈడి దర్యాప్తులో వెల్లడైంది. ఎస్‌బీఐ బ్యాంక్ కు చెల్లించడకుండా వ్యక్తిగత ఖాతాలకు మళ్లీంచారని గర్తించినట్లు పేర్కొన్నారు. రుణాలు చెల్లించకపోవడంతో ఎస్‌బీఐకి నష్టం వాటిల్లినట్లు గుర్తిచి ఎస్ఈపిఎల్ ఎండి సాగిరాజు సూర్యనారాయణ రాజు కు చెందిన ఆస్తులను స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు తెలిపారు.






