Falcon Scam: ఫాల్కన్ స్కాంలో కీలక పరిణామం.. ఈడీ అధికారిక ప్రకటన విడుదల

by Ramesh Naini |

ఫాల్కన్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

Falcon Scam: ఫాల్కన్ స్కాంలో కీలక పరిణామం.. ఈడీ అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: మల్లీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో అమాయకుల నుంచి సంస్థ డిపాజిట్ చేయించుకుని కోట్లు కొల్లగొట్టిన (Falcon scam) ఫాల్కన్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రూ.18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు శుక్రవారం ఈడీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎఫ్ఐడీ చైర్మన్ అమర్‌దీప్‌కుమార్ నేతృత్వంలోని కంపెనీ.. రూ.792 కోట్లు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది.

మోసపూరిత పొందిన నిధులతో కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ హాకర్ 800 ఏను ఈడీ గతంలో స్వాధీనం చేసుకుంది. కాగా, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట మెస్సర్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు అమర్‌దీప్ కుమార్‌పై ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. అధిక లాభాల ఆశ చూపించి 7,056 మంది నుంచి సుమారు రూ. 4,215 కోట్లు వసూలు చేసినట్లు ఫాల్కన్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. 4065 మంది బాధితులకు రూ.792 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

Next Story