- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో అనిల్ అంబానీ ఆస్తుల జప్తు.. రాజ్‌భవన్ రోడ్‌లో రెండు ఫ్లాట్లు గుర్తించిన ఈడీ
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ (అధికారులు హైదరాబాద్‌లో గుర్తించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ (Anil Ambani) సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ (ED) అధికారులు హైదరాబాద్‌లో గుర్తించారు. ఈ మేరకు రిలయన్స్ అనిల్ అంబానీ సంస్థల ఆస్తులను ఈడీ అధికారులు తాత్కలికంగా అటాచ్ చేసినట్లు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 42 ప్రాపర్టీలకు చెందిన రూ.3,083 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసి అక్టోబర్ 31వ తేదీన ఆస్తులను అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. పాలీ హిల్ రెసిడెన్సీ అండ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థల కార్యాలయం ఆస్తులను హైదరాబాద్ లో గుర్తించారు. వాటితో పాటు సోమాజీగూడ రాజ్ భవన్ రోడ్ లో కాముస్ కాప్రి అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లను గుర్తించి స్వాధీన పరచుకున్నారు.
హైదరాబాద్‌లోని పాట్లను ఎపీలోని ఈస్ట్ గోదావరిలో గుర్తించారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబాయి, పూణే, థానే, చెన్నై, కాంచిపురంలో భారీగా ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంస్థలైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంస్థలు ప్రజా ధనాన్ని దారి మళ్లించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది. రూ.19,694 కోట్లు బ్యాంకులకు బాకాయిలు ఉన్నట్లు ఆస్తులు ఎన్‌పీఏగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.






