- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయీం కేసులో కీలక పరిణామం.. వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరిన ఈడీ
ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం గతంలో నక్సలైట్‌గా చెప్పుకొని అనేక మర్డర్లు చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం (Nayeem) గతంలో నక్సలైట్ గా చెప్పుకుంటూ అనేక మర్డర్లు చేశాడు. ఎన్నో క్రిమినల్ కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీంని 2016, ఆగస్టు 8న షాద్‌నగర్‌లో పోలీసులు ఎన్ కౌంటర్ ‘(Encounter) చేశారు. కాగా ఈ ఎన్‌కౌంటర్ కేసు చుట్టూ అనేక వివాదాలు, ఆరోపణలు నెలకొన్నాయి. నయీం ఎన్ కౌంటర్ అనంతరం అతని బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించారు. తమను బెదిరించి ఆస్తులు లాక్కున్నారని కేసులు నమోదు చేయడంతో.. కేసులో ఈడీ అధికారులు (ED officials) రంగంలోకి దిగారు. సుదీర్ఘ విచారణ అనంతరం నయీం కు సంబంధించిన 35 ఆస్తులను ఇటీవల ఈడీ అధికారులు జప్తు చేశారు.
2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు(Money Laundering Case)ను నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగించిన తర్వాత ఆస్తులను జప్తు చేశారు. అలాగే తాజాగా.. నయీం కుటుంబసభ్యుల పై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ చేయాలని ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. క్రిమినల్‌గా ఉన్న సమయంలో అక్రమంగా బెదిరించి తన కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిన భూముల విషయంలో ఎన్ని సార్లు సమన్లు ఇచ్చిన నయీం కుటుంబ సభ్యులు స్పందించడం లేదని కోర్టుకు తెలిపారు. తమ నోటీసులకు స్పందించని వారిపై వెంటనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఈడీ (ED) కోర్టును కోరింది. మరీ ఈడీ రిక్వెస్ట్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






