Jubilee Hills: జూబ్లీహిల్స్ బై పోల్‍కు రంగం సిద్ధం!.. కీలక అప్ డేట్ ఇచ్చిన ఈసీ

by Prasad Jukanti |   (  Updated:2025-10-04 13:23:05  IST  )

జూబ్లీబిల్స్ బై పోల్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక అప్ డేట్ ఇచ్చింది.

Jubilee Hills: జూబ్లీహిల్స్ బై పోల్‍కు రంగం సిద్ధం!.. కీలక అప్ డేట్ ఇచ్చిన ఈసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ విషయంలో పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. గెలిచి తీరేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్(BRS), బీజేపీలు (BJP) నువ్వా నేనా అన్నట్టు రాజకీయం నడుపుతున్నాయి. ఉప ఎన్నిక కోసం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతున్నదన్న ప్రచారం వేళ ఈసీ కీలక అప్ డేట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో (Jubilee Hills by-poll) జరగనున్న ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకులను నియమించినట్లు ఈసీఐ ఆదివారం తెలిపింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జమ్ము జమ్మూ & కాశ్మీర్ (బుడ్గామ్, హైరోటా), రాజస్థాన్ (అంట), ఝార్ఖండ్ (ఘట్సిలా), తెలంగాణ (జూబ్లీహిల్స్), పంజాబ్ (టార్న్ తరణ్), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది.

470 మంది అధికారులు:

ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్ర అబ్జర్వర్లుగా (Central Observers) 470 మంది అధికారులను ఈసీ (Election Commission of India) నియమించింది. వీరిలో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్/ఐఆర్ఏఎస్/ఐసీఏఎస్ అధికారులు ఉన్నారు. ఈసీఐకి పరిశీలకులు కళ్లు, చెవులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధించిన వివరాలు వీరు నేరుగా ఎన్నికల కమిషన్‍కు నివేదిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 20బి ప్రకారం ఈ పరిశీలకులను నియమించినట్లు ఈసీ తెలిపింది.

దీపావళి తర్వాత నోటిఫికేషన్!:

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బై పోల్ నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు దీపావళి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు వర్గాలు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచి తీరేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Next Story