బ్రేకింగ్: ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ

by Satheesh |   (  Updated:2023-11-29 14:16:38  IST  )

మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల విధుల నుండి పలువురు అధికారులను తప్పించిన ఈసీ.. తాజాగా

బ్రేకింగ్: ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల విధుల నుండి పలువురు అధికారులను తప్పించిన ఈసీ.. తాజాగా ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఏసీపీ జహంగీర్‌లను ఈసీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పార్టీల డబ్బుల పంపిణీలో పక్షపాతం చూపారని వీరిపై వేటు వేసినట్లు ఈసీ తెలిపింది.

ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ కానున్న సమయంలో ముగ్గురు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఈసీ పెద్ద ఎత్తున అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించిన విషయం తెలిసిందే. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించడంతో అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంగా మారింది.

Next Story