ఆ రోజు ఉద్యోగులకు లీవ్ ఇవ్వాల్సిందే.. IT కంపెనీలకు ఈసీ సీరియస్ వార్నింగ్..!

by Satheesh |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు

ఆ రోజు ఉద్యోగులకు లీవ్ ఇవ్వాల్సిందే.. IT కంపెనీలకు ఈసీ సీరియస్ వార్నింగ్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఇవాళ ఓ ప్రకటన జారీ చేశారు. ఉద్యోగులు ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

Next Story