- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయంత్రం 6 తర్వాత ప్రచారం చేస్తే కేసు పెడతాం: EC
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By Election) ప్రచారం తుది దశకు చేరుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By Election) ప్రచారం తుది దశకు చేరుకుంది. కాసేపట్లో ప్రచార పర్వం ముగియనుంది. సరిగ్గా ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. నిబంధనలను అతిక్రమించి ఎవరు ప్రచారం చేసినా కేసులు నమోదు చేస్తామని రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రచారంపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ సిట్టింగ్ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. సిట్టింగ్స్థానాన్ని తిరిగి గెలుచుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్తగా తమ ఖాతాలో మరో సీటును వేసుకోవడానికి, హైదరాబాద్ జిల్లాలో పాగ వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈనెల 11న మంగళవారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4.01లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌కేంద్రంలో సగటున 986 ఓటర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.






