TG: రేపే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. కలెక్టర్లకు EC కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌(Local Elections Notification)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నుంచి అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల సంఘం(Election Commission) దూకుడు పెంచింది.

TG: రేపే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. కలెక్టర్లకు EC కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌(Local Elections Notification)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నుంచి అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల సంఘం(Election Commission) దూకుడు పెంచింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. నామినేషన్లు, శాంతి భద్రతలపై ఈసీ కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు ఈసీకి వివరించారు. మరోవైపు తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషనర్‌ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Next Story