స్థానిక ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ

by Muthe.Rajitha |

రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక అప్డేట్ ప్రకటించారు.

స్థానిక ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక అప్డేట్ ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో జనాభా లెక్కలు జరగనందున 2011 లో జరిగిన సెన్సెస్ ఆధారంగా ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. 5 వేల పైగా ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని, 5 వేల లోపు ఓటర్లు ఉంటే రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున మాత్రమే ఖర్చు పెట్టాలని ఎన్నికల అధికారులు వివరించారు. ఇక మరోవైపు స్థానిక ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకటీ రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కిడా వచ్చే అవకాశం ఉండటంతో.. డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story