హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: గాంధీ ఆస్పత్రికి రెండు అనుమానిత కేసులు

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లో ఎబోలా లక్షణాలతో అపోలో ఆస్పత్రి జాయిన్ అయిన ఇద్దరిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: గాంధీ ఆస్పత్రికి రెండు అనుమానిత కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో ఎబోలా వైరస్ (Ebola Virus) భయాలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆఫ్రికా దేశాల ప్రయాణ నేపథ్యం (Travel History) ఉండటం, ఎబోలా అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్య వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. లక్షణాల తీవ్రతను గమనించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి, ఎబోలా నిబంధనల (Protocols) ప్రకారం బాధితులను గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేసింది. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డుకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.

సీసీఎంబీకి శాంపిల్స్..

వైద్యుల సమాచారం ప్రకారం.. బాధితులకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రోటోకాల్‌ ప్రకారం వారి రక్తం, లాలాజలం శాంపిల్స్‌ను సేకరించి, తక్షణ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ(CCMB) ల్యాబొరేటరీకి పంపించారు. ఈ పరీక్షల నివేదికలు (Reports) రావడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ అని తేలితే, తదుపరి ధృవీకరణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)‌కి పంపనున్నారు.

Next Story