Eatala Rajender: హైదరాబాద్ నగరంపై ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasad Jukanti |

హైదరాబాద్ నగరంపై ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Eatala Rajender: హైదరాబాద్ నగరంపై ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీనోమ్, సైన్స్ అండ్ టెక్నాలజీకి హైదరాబాద్ కేంద్రం కావడం గర్వకారణంగా ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఐఐసీటీలో స్టార్ట్ అప్ కాంక్లేవ్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి పాల్గొన్న ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రంగ సంస్థలకు ఇవాళ హైదరాబాద్ నిలయాంగా మారిందని అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ నగరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్ లో మరింత గొప్పగా తన స్థానం నిలబెట్టుకోబోతున్నదని ఆశిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ధి పంథాలో దూసుకుపోతున్నదన్నారు.

గతంలో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత దేశం మోడీ పాలనలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఒక నాడు ఏదో ఓ దేశం, ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తే తప్ప తన కాళ్లమీద తాను నిలబడని భారతదేశం ఇవాళ మోడీ పాలనలో ఇండియా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నదని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం, ఫార్మా, ఇతర రంగాల్లో ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ పరిజ్ఞానం 30 ఏళ్ల వరకు మన దేశానికి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఆ తరహా అభివృద్ధి మన దేశంలో ఓ చాలెంజ్ గా తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలో మరే దేశానికి లేని యువ శక్తి భారత్ కు ఉందని యువత కొత్త ఆవిష్కరణలకు మోడీ సర్కార్ అండగా నిలుస్తోందన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్రం రూ. 4 లక్షల కోట్లను బడ్జెట్ లో కేటాయించిందన్నారు.

Next Story